అమెరికా సెనేట్ లో తీర్మానం… అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే
ఇరుగు పొరుగు దేశాలతో, ప్రత్యేకించి భారత్‌తో పదే పదే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న చైనాకు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత అంతర్భాగంగా గుర్తిస్తూ సెనేట్ (పార్లమెంట్ ఎగువ సభ)లో డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు జెఫ్ మెర్క్లీ, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బిల్ హాగెర్టీ ఓ ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అరుణాచల్‌ప్రదేశ్ వివాదాస్పద భూభాగం కాదని, అది భారత్‌లో అంతర్భాగమేనని ఆ తీర్మానంలో స్షష్టం చేశారు. తద్వారా సైనిక దురాక్రమణతో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పారు.






