ఇక తెలుగులోనూ అమెరికా ప్రభుత్వ సమాచారం
అమెరికాలోని వైట్‌హౌస్, ఫెడరల్ ఏజెన్సీల పాటు కీలకమైన ప్రభుత్వం వైబ్సైట్లను హిందీ, తెలుగు, గుజరాత్, పంజాబ్ తదితర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని యూఎస్ ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుకు ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ ఆన్ ఆసియన్ అమెరికన్స్ (ఏఏ), నేటివ్ హవాయియన్స్, పసిఫిక్ ఐలాండర్స్(ఎన్హెచ్పీఐ) ఇటీవలే అమోదించింది. పబ్లిక్, ఎమర్జెన్సీ హెచ్చరికలు ఆంగ్ల భాషలో నైపుణ్యం లేనివారికి కూడా సులువుగా చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రెసిడెన్షియల్ కమిషన్ సూచించింది. కమిషన్ సిఫార్సులపై అధ్యక్షుడు జో బైడెన్ ఆమోద ముద్రవేస్తే అమల్లోకి రానున్నాయి.






