జో బైడెన్ రహస్య పత్రాలపై ఆరా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో, పూర్వ కార్యాలయంలో అధికార రహస్య పత్రాలు లభించడంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ హర్ ఆయన్ని ప్రశ్నించారని శ్వేతసౌధం తెలిపింది. బైడెన్‌ను వైట్‌హౌస్‌లోనే ఇంటర్వ్యూ చేశారని అధికార ప్రతినిధి ఇయాన్ శామ్స్ తెలిపారు. బైడెన్ గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెలావర్‌లో బసచేసిన విశ్రాంతి గృహంలో కొన్ని పత్రాలు లభించాయి. గతంలో ఆయన ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసేటప్పుడు వాసింగ్టన్‌లో ఉపయోగించిన ఒక కార్యాలయంలో మరికొన్ని పత్రాలు లభ్యమయ్యాయి. గత నవంబరు, డిసెంబరుల్లో ఈ పత్రాలు బయటపడ్డాయి. అవి అక్కడికి ఎలా వచ్చిచేరాయో తనకే తెలియదని బైడెన్ ప్రకటించారు. ఆ పత్రాల్లో ఉక్రెయిన్, ఇరాన్, బ్రిటన్‌కు సంబంధించి గూఢచారి వర్గాలు అందించిన సమాచారం ఉన్నట్లు తెలిసింది.






