అమెరికా మధ్యంతర ఎన్నికల్లో జో బైడెన్ కు ఊరట
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్ల వ్యతిరేకత ఉన్నా మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ఓటర్లు డెమోక్రాటిక్ పార్టీ పట్ల సానుకూలత ప్రకటించారు. రిపబ్లికన్లకు పట్టుకున్న కీలక స్థానాల్లోనూ డెమోక్రాటిక్ అభ్యర్థులను గెలిపించారు. బైడెన్ పట్ల వ్యతిరేకత, ద్రవ్యోల్బణం, అబార్షన్‌పై సుప్రీం కోర్టు తీర్పు తమకు మేలు చేస్తాయని భావించిన రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతినిధుల సభలో మొత్తం సీట్ల (435), సెనెట్‌లో 35 స్థానాలతో పాటు 36 గవర్నర్ స్థానాలకు పోలింగ్ ముగిసింది. పాలనాపరంగా అమెరికాలో ఈ మధ్యంతర ఎన్నికలు చాలా కీలకం. అధ్యక్షుడి పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి.






