Trump photo : ట్రంప్ ఫొటోతో 250 డాలర్ల నోట్లు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటో (Trump photo )తో 250 డాలర్ల నోటును ముద్రించాలని ప్రతినిధుల సభ సభ్యుడు జో విల్సన్ (Joe Wilson ) ప్రతిపాదించారు. బైడెన్ (Biden) పాలనలో పెరిగిన ద్రవ్యోల్బణమే తాను పెద్ద నోటు ముద్రణ ప్రతిపాదన చేయడానికి తనను పురిగొల్పిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమెరికన్లు భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తేగానీ వారి అవసరాలు తీరని విధంగా ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. అందుకే ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల నోటు (250 dollar bill )ను ముద్రించాలని బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్ (Bureau of Engraving and Printing)కు సూచిస్తూ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు.