యూఎస్ కాంగ్రెస్ కు బైడెన్ పిలుపు.. తక్షణమే అనుమతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార యంత్రాంగం అమెరికా లెజిస్లేచర్ కేంద్రీకృత వ్యవస్థ యూఎస్ కాంగ్రెస్‌కు హెచ్చరికలు వెలువరించింది. వెంటనే ఉక్రెయిన్‌కు సైనిక ఆర్థిక భారీ సాయం అంటే లక్ష లాది బిలియన్ డాలర్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపి తీరాలని తేకపోతే రష్యా ఆక్రమణల దాడి నుంచి ఉక్రెయిన్ను రక్షించడం కష్టం అవుతుందని ఈ తక్షణ హెచ్చరిక సందేశంలో తెలిపారు. వైట్‌హౌస్ నుంచి అధికారికంగా ఈ సమాచారం పంపించారు. ఉభయ సభలకు, సెనెట్ లీడర్స్‌కు, ప్రజలకు ఈ సమాచారం వెల్లడించారు. ఉక్రెయిన్‌కు పూర్తి స్థాయి మద్దతును అమెరికా తన కీలక పాలసీ నిర్ణయంగా తీసుకుంది. ఇప్పుడు ఉన్న నిధులు ఈ ఏడాది చివరికి ఆవిరవుతాయి. దీనితో రణరంగంలో ఉక్రెయిన్ చతికిలపడుతుంది. వెంటనే నిధులు మంజూరికి చట్టసభలు ఆమోదం తెలపాల్సి ఉంటుందని ఇప్పటి లేఖలలో కోరారు.






