బైడెన్ ప్రభుత్వానికి జాన్ కెర్రీ గుడ్ బై!
వాతావరణ అంశంపై అమెరికా ప్రత్యేక దూత జాన్ కెర్రీ తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులు తాజాగా ఈ విషయాన్ని తెలియజేశారు. సెనెటర్‌గా, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2020 నవంబరులో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్ వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వ వాణిని వినిపించడానికీ కెర్రీని ఎంపిక చేసుకున్నారు. 2015లో కుదిరిన పారిస్ ఒప్పంద ముసాయిదా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా దాదాపు దశాబ్దాల పాటు సేవలు అందించారు.






