Donald Trump: డొనాల్డ్ ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ

వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) (88) అంతిమయాత్ర ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 164 మంది హాజరయ్యారు. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) తదితరులు ఇందులో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కాసేపు సమావేశమయినట్లు అధికారులు పేర్కొన్నారు. యద్ధం ముగింపు ఖనిజాల ఒప్పందం మొదలైన విషయాల గురించి వారు చర్చించినట్టు, ఇద్దరి మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని అధ్యక్ష కార్యాలయాలు వెల్లడిరచాయి. అమెరికాలోని ఓవల్ కార్యాలయం(Oval Office) లో ట్రంప్‌నకు, జెలెన్‌స్కీకి వాగ్వాదం జరిగిన తర్వాత వారు కలవడం ఇదే మొదటి సారి.