Donald Trump :ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తాం : ట్రంప్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం కారణంగా అమాయక పౌరుల మరణాలను ఆపాలని మాస్కో అధినేత పుతిన్ (Putin) భావిస్తున్నారని తెలిపారు. ప్రజలు చనిపోవడం బాధాకరం, ఈ మరణహోమాన్ని ఆపాలని పుతిన్ అనుకుంటున్నారు. మృతులంతా యువకులే. అమాయకులు, వారు మీ పిల్లల వంటివారే. ఆకారణంగా లక్ష మంది చనిపోయారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఉండివుంటే యుద్ధం జరిగేది కాదన్నారు. గతంలో రష్యా (Russia)తో తనకున్న సంబంధాలను ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. నాకు పుతిన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే అమెరికా దేశానికే బైడెన్ (Biden) ఓ అవమానం అని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ (Ukraine)తో రష్యా యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.