Donald Trump :ఈస్టర్ వేళ జడ్జిలపై ట్రంప్ తీవ్ర విమర్శలు

ఈస్టర్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. హంతకులను, డ్రగ్స్ వ్యాపారులను, నేరస్థులను, ఎంఎస్-13 గ్యాంగ్ సభ్యులను అమెరికా (America)లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్న రాడికల్ (Radical) వామపక్షవాదులకు ఈస్టర్ శుభాకాంక్షలు (Greetings) తెలిపారు. నేరస్థులను దేశంలోకి అనుమతిస్తున్న బలహీన న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారులకు కూడా ఈస్టర్ శుభాకాంక్షలు అని తెలిపారు. బైడెన్ (Biden) అసమర్ధుడని, లక్షలాది మంది క్రిమినల్స్‌ను దేశంలోకి అనుమతించారని మండిపడ్డారు.