Donald Trump : డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ …వారు వెళ్లిపోతే

అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల (Illegal immigrants)కు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంపర్ ఆఫర్ ప్రకటించారు. సొంతంగా స్వదేశాలకు వెళ్లిపోవాలనుకునే వారికి (సెల్ఫ్ డిపోర్టేషన్) ఖర్చులకు డబ్బులు సహా, విమాన టికెట్ల (Flight tickets )ను ఇస్తామని తెలిపారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటూ, నేరాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇలా ఉంటున్న వారి కోసం సెల్ఫ్ డిపోర్టేషన్ (Self-deportation) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. వారు చట్టపరమైన పద్ధతిలో అమెరికా (America)కు తిరిగిరావడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.