హారిస్‌తో భేటీకి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం… షరతులు ఇవే!
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కామ్రేడ్ కమలాహారిస్‌తో చర్చకోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఏబీసీ ఫేక్‌న్యూస్‌లో అది ప్రసారమవుతుందని, అది అత్యంత అన్యాయమైన వార్త సంస్థ అని మండిపడ్డారు. సెప్టెంబర్ 10వ తేదీన ఫిలడెల్పియాలో ఈ కార్యక్రమం ఉందని వివరాలు చెబుతూనే ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ భేటీకి నిర్దిష్ట షరతులు, నియమాలను ట్రంప్ వివరించారు. జూన్ 27న సీఎన్ఎన్లో అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన చర్చలో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను, కమలా హారిస్ ఒప్పందానికి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని తెలిపారు. అభ్యర్థులు మాట్లాడనప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్ చేసి ఉంటాయని తెలిపారు.






