Abortion : అబార్షన్ వ్యతిరేక ఉద్యమకారులకు ట్రంప్ క్షమాభిక్ష

అమెరికాలో అబార్షన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన 23 మందికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారని వైట్‌హౌస్ (White House) పేర్కొంది. 2020లో వాషింగ్టన్ (Washington) లోని ఓ ప్రసూతి ఆసుపత్రి వద్ద అబార్షన్లకు వ్యతిరేకంగా పలువురు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రికత్తతకు దారి తీశాయి. వీటికి నాయకత్వం వహించిన లారెన్ హ్యాండీ (Lauren Handy )తో సహా 23మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లారెన్ హ్యాండీ ఇంట్లో ఐదు పిండాలను అధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడిరది. తాజాగా వారందరికీ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు.