Donald Trump : రష్యా విషయంలో అత్యంత కఠినంగా ఉన్న అధ్యక్షుడిని నేను

తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకొన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)కి కృతజ్ఞత లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చాక్లెట్ (Chocolate) లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్‌స్కీ తీసుకొన్నట్లు అభివర్ణించారు. అతను (ఉక్రెయిన్ అధ్యక్షుడు) పసిబిడ్డ నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా బైడెన్ (Biden) సర్కారు నుంచి సొమ్ములు తీసుకొన్నారు. ఇక రష్యా విషయంలో అత్యంత కఠినంగా ఉన్న అధ్యక్షుడిని నేను. దాని పైప్‌లైన్ ఆపి ఆంక్షలు విధించాను. జావెలిన్ క్షిపణులు అందజేశాను. కానీ, పుతిన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయి. రష్యా విషయంలో నన్ను మించి కఠినంగా ఎవరూ లేరు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.