డొనాల్డ్ ట్రంప్ కు 10 వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు స్థానిక కోర్టు ఒకటి 10 వేల డాలర్ల జరిమానా విధించింది. న్యాయస్థానం వెలుపల కోర్టు సిబ్బందిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈ జరిమానా వేస్తున్నట్లు న్యాయమూర్తి ఆర్థర్ ఎన్గోరాన్ వెల్లడిరచారు. అంతుకు ముందు కొన్ని వారాల క్రితమే ఆయన తన సిబ్బందిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిని ట్రంప్ ఉల్లంఘించడంతో తాజా జరిమానాకు గురయ్యారు. అయితే ట్రంప్ ఓ సాక్షిపై వ్యాఖ్యానాలు చేశారు తప్పితే న్యాయమూర్తి గుమస్తా మీద కాదని ట్రంప్ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. గత వారం కూడా ఇటువంటిదే మరో కేసులో ట్రంప్‌నకు జడ్జి 5 వేల డాలర్ల జరిమానా విధించారు.






