Gaza: బందీలను వదలకుంటే మీ పనిపడతా…హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం

గాజా స్ట్రిప్‌లో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ (Israeli )లు, ఇతర దేశస్తులను శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదల చేయకపోతే హమాస్ (Hamas) అంతుచూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలను విడుదల చేసి తీరాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావొచ్చని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. వైట్‌హౌస్ (White House)లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఒకటి, మూడు, నాలుగు, రెండు ఇలా కాదు, మొత్తం బందీలందరినీ విడుదల చేయాలి. శనివారం (Saturday) మధ్యాహ్నం 12 గంటలకల్లా బందీల్లు అందరూ విడుదలై మా చెంతకు చేరాలి. లేదంటే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తాం.కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశిస్తా అని అన్నారు.