డొనాల్డ్ ట్రంప్ సలహాదారుడిగా.. ఎలాన్ మస్క్!
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్‌ను సలహాదారుడిగా నియమించుకోవలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్ హోదాలో అతణ్ని వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ట్రంప్, మస్క్ మాత్రం ఇప్పటికే పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారిద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణలు జరుగుతున్నట్లు ట్రంప్ ప్రచార బృందంలోని కొంతమంది వెల్లడించారు. సరిహద్దు, ఆర్థిక, విద్యుత్తు వాహనాల వంటి విధానాల రూపకల్పనలో మస్క్ సలహాలు తీసుకోనున్నట్లు సమాచారం.






