తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద
2024 అధ్యక్ష రేసులో రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు గొప్ప హామీ ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటించారు. మిచిగాన్‌లో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ట్రంప్, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుండి తరిమికొట్టే అధ్యక్షుడి కోసం నవంబర్ ఎన్నికల్లో ఓటు వేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నవంబర్‌లో ప్రతి ఓటరకు ఎంపిక స్పష్టంగా ఉంది. మీరు వేలాది మంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను మన దేశంలోకి అనుమతించే అధ్యక్షుడిని గెలిపిస్తారో లేక రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుండి నరకంలోకి విసిరే అధ్యక్షుడిని ఎన్నుకుంటారో తేల్చుకోవచ్చు అని అన్నారు. నా కొత్త పరిపాలనలో మొదటి రోజున మేము అమెరికన్ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ చర్యను ప్రారంభిస్తాము. మాకు వేరే మార్గం లేదు అని నొక్కి చెప్పారు. రిపబ్లికన్ శిబిరం వలసదారుల దండయాత్రను హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున ట్రంప్ వ్యాఖ్యలు వచ్చాయి.






