US Aid : 1600 మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అభివృద్ధి కోసం యూఎస్ ఎయిడ్ (US Aid )తో పనిచేసే అమెరికా ఏజెన్సీకి చెందిన కొందరిని తప్పించి మిగిలిన అందరినీ సెలవుపై పంపుతున్నట్లు ట్రంప్ (Trump) యంత్రాంగం వెల్లడిరచింది. వారిలో అమెరికా కేంద్రంగా పనిచేసే 1600 మందిని ఉద్యోగాల (Jobs) నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. సమాఖ్య ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఆరు దశాబ్దాల నాటి సహాయ, అభివృద్ధి ఏజెన్సీని రద్దు చేయడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఆయన స్నేహితుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజా చర్య అతిపెద్ద దశల్లో ఒకటిగా నిలిచింది. ప్రభుత్వ చర్యల నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి కార్ల్ నికోలస్(Carl Nicholas) తోసిపుచ్చారు. మరోవైపు తాము సాధించిన విజయాలను వివరించకపోతే అటువంటి ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామంటూ ఎలాన్ మస్క్ పేర్కొనడం చట్ట విరుద్దమంటూ పలువురు సమాఖ్య ఉద్యోగులు తాజాగా కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేశారు.