రైతు ఉద్యమానికి అమెరికన్ చట్టసభ్యులు మద్దతు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళనలపై అమెరికా స్పందించాలని భారతీయ అమెరికన్ చట్టసభ్యుల బృందం మైక్ పాంపియోకి లేఖ రాసింది. ఈ బృందంలో అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమిళ జైపాల్ తో పాటు ఏడుగురు చట్టసభ్యులు ఉన్నారు. అనేక మంది భారత-అమెరికన్ కుటుంబాలు ఈ చట్టాలతో ప్రభావితం అవుతాయని, అందువల్ల భారత విదేశాంగ మంత్రితో సత్వరమే చర్చలు జరపాలని ఆ లేఖలో కోరారు. అమెరికా సమాజం ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తుందని ఈ సమయంలో భారత్‌కు తగిన సలహాలివ్వాలని పాంపింయోను కోరారు. నూతన సాగు చట్టాలు భారతీయ రైతులకు ముఖ్యంగా పంజాబ్‌కు తీవ్ర నష్టం చేకూరుస్తాయని సిక్కు అమెరికన్ చట్టసభ్యులు డిసెంబర్ 23న పాంపియోకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రస్తుత చట్టాలపై భారత ప్రభుత్వ విధానాలను గౌరవిస్తామని తెలిపిన చట్టసభ్యులు శాంతియుతంగా నిరసలు చేస్తోన్న రైతుల ఆర్థిక భద్రతకు భరోసానివ్వాలని వారు లేఖలో కోరారు.






