అమెరికాలో భద్రత కట్టుదిట్టం…
అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హింస చెలరేగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించటంతో అమెరికాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అల్లరిమూకలు దాడులకు దిగితే నష్టం జరుగకుండా ఉండేందుకు న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో షాపులు స్వచ్ఛందంగా మూసేశారు. అద్దాలతో నిర్మితమైన షాపుల యాజమానులు తమ దుకాణాల చుట్టూ ఫ్లైవుడ్ చెక్కలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ చుట్టూ అదనపు బలగాలు మోహరించారు. 600 మంది నేషనల్ గార్డస్ను కూడా సిద్దంగా ఉంచారు. హింస చెలరేగితే నిరోధించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయమని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు.






