జో బైడెన్ తో కలిసి పనిచేస్తాం : ఓబ్రియాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులో అవినీతి జరిగిందంటూ ఓవైపు ట్రంప్ కోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో ఓబ్రియాన్ వ్యా్య•లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కీలక బాధ్యతల్లో ఉన్న ఓబ్రియాన్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి. గ్లోబల్ సెక్యూరిటీ ఫోరంలో ఈ మేరకు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ మరో నాలుగేళ్లు ఆ పదవిలో కొనసాగాలని ఆశిస్తున్నానని అంటూనే, ఒక వేళ నూతనంగా ఎన్నికైన జో బైడెన్•, కమలా హారిస్ నేతృత్వంలోని ప్రభుత్వ బాధ్యతలు చేపట్టినా, వారితో కలిసి పని చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కొత్త ప్రభుత్వం కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. ప్రభుత్వ మేదైనా ఇప్పటిలాగే బాధ్యతలను నిర్వర్తిస్తాను. అందులో ఎటువంటి సందేహం లేదని అని ఓ బ్రియాన్ సృష్టం చేశారు.






