Donald Trump: నా బెదిరింపులతో బ్రిక్స్ అంతమైంది : ట్రంప్

బ్రిక్స్ దేశాలు డాలరుతో ఆటలాడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ప్రధాని మోదీ (Modi)తో భేటీకి కొన్ని గంటల ముందు ఆయన ఈ విషయంపై మాట్లాడటం గమనార్హం. బ్రిక్స్ (Bricks) ను విచ్ఛిన్నం చేయాలనుకుంటు న్నారా లేక అందులో భాగమవుతారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ బ్రిక్స్ ఓ చెడ్డ ప్రతిపాదనను తీసుకొచ్చింది. చాలామందికి అది ఇష్టం లేదు. ప్రస్తుతం దానిపై మాట్లాడటానికి కూడా వారు వెనకాడుతున్నారు. డాలరు (Dollar) తో ఆడుకోవాలనుకుంటే చర్యలు తీసుకుంటాననే నా హెచ్చరికతో వారు భయపడ్డారు. మాకు వ్యతిరేకంగా చర్యలు చేపడితే, ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తా. ఒకవేళ వారు అది చేయాలనుకుంటే టారిఫ్ (Tariffs ) లు విధించవద్దని నా దగ్గరకు వచ్చి వేడుకుంటారు. నా బెదిరింపులతో బ్రిక్స్ అంతమైంది అని ట్రంప్ పేర్కొన్నారు.