వైట్‌హౌస్‌లో పెంపుడు జంతువుల సందడి!
ఒబామా అనంతరం పెంపుడు జంతువులు లేకుండా పోయిన వైట్‌హౌస్‌లోకి మరలా జో బైడెన్ రాకతో పెంపుడు జంతువుల సందడి మొదటైంది. బైడెన్‌కు చెందిన రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఛాంప్, మేజర్ వైట్‌హౌస్‌లోకి కాలుమోపాయి. వైట్‌హౌస్‌లో కుదురుకున్న తర్వాత కుక్కలను తెచ్చుకోవాలని బైడెన్ కుటుంబం భావించిందని జో బైడెన్ ప్రతినిధి మైఖెల్ లారోసా చెప్పారు. వీటిలో మేజర్ అనే కుక్కతో ఆడుకుంటూ గతేడాది బైడెన్ కిందపడినే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ రెండూ వైట్‌హౌస్‌లో తమకే కేటాయించిన బైడ్స్ను ఎంజాయ్ చేస్తున్నాయని మైఖెల్ చెప్పారు. మేజర్ డాగన్ను బైడెన్ 2018లో డెలావర్ హ్యూమన్ అసోసియేషన్ నుంచి దత్తత తీసుకున్నారు. బజారు కుక్క నుంచి దేశ ఫస్ట్ డాగ్‌గా మేజర్ జర్నీని పురస్కరించుకొని ఈ ఆసోసియేషన్ గతవారం ఫండ్ రైజింగ్ చేసి 2 లక్షల డాలర్లు సమీకరించింది. త్వరలో బైడెన్ కుటుంబం ఒక పిల్లిని కూడా తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. గతంలో థియోడర్ రూజ్ వెల్ట్, హోర్డింగ్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ట్రూమన్, జార్జ్‌బుష్, క్లింటన్, ఒబామాలు తమ తమ పెంపుడు జంతువులను వైట్‌హౌస్‌లో తమతో ఉంచుకున్నారు.






