Capitol Hill :చేదు నిజాన్ని క్షమాపణ మార్చలేదు.. ట్రంప్ నిర్ణయంపై

క్యాపిటల్ హిల్ (Capitol Hill )పై దాడి దోషులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించ డాన్ని పలువురు న్యాయమూర్తులు తప్పుబట్టారు. న్యాయమూర్తి తాన్యా చుట్కాన్(Tanya Chutkan) స్పందిస్తూ ఆ చేదు నిజాన్ని ఏ క్షమాపణ మార్చలేదు. శాంతియుతంగా జరగాల్సిన అధికార మార్పిడిలో చోటుచేసుకున్న ఉల్లంఘనను సరిదిద్ద లేరు అని వ్యాఖ్యానించారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి మోసం జరగలేదు. శాంతియుతంగా జరగాల్సిన అధికార బదిలీకి నాడు ఓడిపోయినవారు ఆటంకం కలిగించడం సరికాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొచ్చు అని జడ్జి బెరిల్ హూవెల్ (Beryl Howell )పేర్కొన్నారు. మరో న్యాయమూర్తి కొలీన్ కొల్లార్ కోటెల్(Colleen Kollar Kotel) సైతం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, విచారణ, రికార్డులు, జ్యూరీ తీర్పులను భద్రపరిచినట్లు తెలిపారు.