Zelensky : వారు ఎప్పటికీ నాటో సభ్యులు కాలేరు : జెలెన్‌స్కీని హెచ్చరించిన ట్రంప్

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు చర్చలు సందిగ్ధంలో పడ్డాయి. కీవ్ అధ్యక్షుడిగా జెలెన్‌స్కీ (Zelensky) తప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు లభిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన జెలెన్‌స్కీ శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనని, అయితే దానికి బదులుగా ఉక్రెయిన్‌కు నాటో కూటమి సభ్యత్వం (NATO membership) ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ట్రంప్ (Trump) స్పందిస్తూ వారు ( కీవ్) ఎప్పటికీ నాటోలో సభ్యులు కాలేరు అని అన్నారు. ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం అనేది ఎప్పటికీ జరగదని జెలెన్‌స్కీకి అర్థమై ఉంటుంది. అందుకే మాతో ఖనిజ వనరుల ఒప్పందంపై తిరిగి చర్చలు జరపాలని చూస్తున్నారని అన్నారు. ఒకవేళ ఖనిజ ఒప్పందం జరగకుంటే కీవ్ (Kiev) కు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.