Netanyahu: ట్రంప్‌కు గోల్డెన్ పేజర్ బహుకరించిన నెతన్యాహు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) గోల్డెన్ పేజర్ (Golden Pager) బహుమతిగా ఇచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న నెతన్యాహు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ (White House)లో జరిగిన సమావేశం సందర్భంగా ట్రంప్ (Trump)కు ఈ కానుక అందించారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్‌లో లెబనాన్‌లో హజ్‌బొల్లా సాయుద సంస్థ సభ్యులను వేర్వేరు చోట్ల ఒకేసారి వేలాది పేజర్‌లను పేల్చేసి హతమార్చినందుకు గుర్తుగా ఈ బంగారు పేజర్‌ను ట్రంప్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగారు పేజర్‌ను చూశాక ట్రంప్ సైతం ఆనాడు శత్రుదేశంలో ఇజ్రాయెల్ (Israel) సాహస దాడి ఆపరేషన్ మెచ్చుకుంటూ అది నిజంగా ఒక గొప్ప ఆపరేషన్ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ సైతం నెతన్యాహు దంపతుల ఒక ఫొటోను బహూకరించారు.