Michelle Obama :ట్రంప్ ప్రమాణానికి మిషెల్ ఒబామా దూరం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రథమ మహిళా మిషెల్ ఒబామా (Michelle Obama) దూరంగా ఉండనున్నారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) హాజరవుతున్నా 150 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ మిషెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter) అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరు కానీ విషయం తెలిసిందే. దాంతో ఒబామా దంపతులకు విభేదాలొచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వారి సన్నిహిత వర్గాలు ఈ వార్తలను ఖండిరచాయి. ఫేక్ నవ్వులు నవ్వలేకే ప్రమాణ స్వీకారానికి మిషెల్ దూరంగా ఉంటున్నారని తెలిపాయి. ఆమెతో పాటు డెమొక్రాట్లు నాన్నీ పెలోసి, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్ తదితరులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవడం లేదు. నాలుగేళ్ల కిందట జో బైడెన్(Joe Biden) ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కూడా గైర్హాజరవడం తెలిసిందే. తద్వారా వైట్‌హౌస్ సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు.