జిల్ బైడెన్‌తో సమావేశానికి … మెలానియా ట్రంప్ దూరం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార మార్పిడి నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరగనున్న సంప్రదాయబద్ధమైన సమావేశానికి ట్రంప్ సతీమణి మెలానియా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో ఈ నెల 13న ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఫస్ట్ లేడీ టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని జిల్ బైడెన్ గత వారమే మెలానియా ట్రంప్‌నకు పంపినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాడు ఫస్ట్ లేడిగా ఉన్న మిచెల్ ఒబామా మెలానియాకు టీ పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత 2020 ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ట్రంప్ భేటీ కావాల్సి ఉన్నా కాలేదు. దీంతో ఈ ఆనవాయితీకి బ్రేక్ పడిరది. తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌నకు శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుత ఫస్ట్ లేడీగా ఉన్న జిల్ బైడెన్ ఇవ్వనున్న టీ పార్టీకి మెలానియా దూరంగా ఉండటం గమనార్హం.






