డొనాల్డ్ ట్రంప్ పై మరో రాష్ట్రం వేటు
రెండోసారి అమెరికా అధినేతగా ఎన్నికయ్యేందుకు బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి నేపథ్యంలో దేశాధ్యక్షుడి పదవికి ఆయన అనర్హుడని ఇటీవల కొలరాడో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించినట్లుగానే తాజాగా మరో రాష్ట్రం ఆయనపై వేటు వేసింది. ఈసారి మైన్ ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సెక్రటరీ (ప్రధాన ఎన్నికల అధికారి) తాజాగా వెల్లడించారు. కొలరాడో తీర్పును సవాల్ చేస్తూ రిబిప్లికన్ పార్టీ అమెరికా (ఫెడరల్) సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.






