భారత్‌కు అందించేందుకు తాము సిద్ధం : అమెరికా
నేల, సముద్రం, గగనతలం, సైబర్ రంగాల్లో రక్షణ కోసం భారత్‌కు అధునాతన సైనిక సాధన సంపత్తిని అందించేందుకు తాము సిద్ధమని అమెరికా ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ తెలిపింది. మానవరహిత విమానాలు, కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి విభాగాల్లో భారత సంస్థలతో భాగస్వాములను ఏర్పర్చుకునేందుకు తాము సిద్ధమని లాక్‌హీడ్ ఉపాధ్యక్షుడు విలియం బ్లెయిర్ తెలిపారు.
భారత వైమానిక దళ అవసరాల కోసం ప్రత్యేకంగా ఎఫ్-21 యుద్ధవిమానాన్ని డిజైన్ చేశామన్నారు. దాన్ని కొనుగోలు చేయాలని మన దేశానికి సూచించారు. ఈ కాంట్రాక్టు తమకు లభిస్తే ఎఫ్-21 యుద్ధవిమానాన్ని డిజైన్ చేశామన్నారు. దాన్ని కొనుగోలు చేయాలని మన దేశానికి సూచించారు. ఈ కాంట్రాక్టు తమకు లభిస్తే ఎఫ్-21 యుద్ధవిమానాలను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తామని, ఇక్కడి నుంచి ఎగుమతులూ చేస్తామని తెలిపారు. ఇందుకోసం టాటా గ్రూప్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు.






