Kennedy :అమెరికా ఆరోగ్య మంత్రిగా కెన్నడీకి ఆమోదం

అమెరికా ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ (Kennedy) జూనియర్ నియామకానికి సెనెట్ (Senate) ఆమోదం తెలిపింది. ఆయనకు అనుకూలంగా 52, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. 71 ఏళ్ల కెన్నడీ కుటుంబం లో అనేక విషాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో చిన్నప్పటి నుంచే ఆయన గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఆహారం(Food), రసాయనాలు(chemicals), టీకాల (vaccines )పై ఆయన విధానాలు పలువురిని ఆకర్షించాయి. కొన్నిసార్లు ఆయన అతివాదాన్ని వినిపిస్తూ ఉంటారు.