నా రన్నింగ్‌మేట్ వాల్జ్ … ప్రకటించిన కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థి (రన్నింగ్‌మేట్)గా టిమ్ వాల్జ్‌ను ఎంపికచేస్తున్నట్లు ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రకటించారు. ప్రస్తుతం టిమ్ మిన్నెసొటా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈయన అభ్యర్థిత్వాన్ని డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గవర్నర్‌గా, కోచ్‌గా, టీచర్‌గా, సాయుధ బలగాల్లో ఎన్నో విధాలుగా శ్రామికవర్గ కుటుంబాల కోసం ఆయన పనిచేశారు. అలాంటి టిమ్ వాల్జ్‌ను రన్నింగ్మేట్గా ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది అని కమలా హారిస్ తెలిపారు. గెలిస్తే మిన్నెసొటాను నుంచి ఉపాధ్యక్షుడైన మూడో వ్యక్తిగా టిమ్ నిలుస్తారు.






