Kamala Harris : కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(Kamala Harris) ఓడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె కాలిఫోర్నియా గవర్నర్ (Governor of California ) గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీకి సిద్ధమైనట్లు సూచనప్రాయంగా తెలిపారు. మరికొన్ని రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడిరచారు. ప్రస్తుతం గావిన్ న్యూసమ్ (Gavin Newsom) కాలిఫోర్నియా గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఆమె 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దశాబ్దాలుగా కాలిఫోర్నియా వాసులు డెమోక్రట్లకే (Democrats) మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆమె ఈ ఎన్నికల్లో పోటీకి దిగితే తప్పక విజయం(Success) సాధిస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశారు.