కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు.. దాన్ని అంతం చేయాల్సిందే
గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించిన వెంటనే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ హమాస్ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్‌ను అంతమొందించాల్సిందేనన్నారు. గాజాను నియంత్రించే అధికారం హమాస్‌కు ఉండకూడదని తేల్చి చెప్పారు. మృతిచెందిన బందీల్లో ఇజ్రాయెల్ సంతతికి చెందిన అమెరికన్ గోల్డ్బెర్గ్ పోలిన్ ఒకరు. దీనిపై కమల సీరియస్ అన్నారు. అమెరికా పౌరులు ఎక్కడున్నా వారి భద్రత మాకు ముఖ్యం. హమాస్ ఉగ్రవాద సంస్థ. దాన్ని అంతం చేయాల్సిందే అని వామె వ్యాఖ్యానించారు.






