Joe Biden :అతి సంపన్నుల ఏలుబడిలోకి అమెరికా : జో బైడెన్

అమెరికాలో అతి సంపన్నులు, శక్తిమంతులు, ఆపార పలుకుబడి కలిగిన అతికొద్దిమందితో ఒక కూటమి ఏర్పడుతోందనీ, దీనివల్ల అమెరికా (America ) ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లనుందని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) హెచ్చరించారు. ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనవరి 20న తన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా బైడెన్ జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. పదవీ కాలంలో తీసుకున్న అధికారిక నిర్ణయాలకు దేశాధ్యక్షుణ్ని దోషిగా నిర్ధారించకూడదని సుప్రీంకోర్టు (Supreme Court) జులైలో ఉద్ఘాటించింది. 2020 అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్నకు ఈ తీర్పు విముక్తి కలిగించింది. ఈ నెల 20న ఆయన మళ్లీ అధ్యక్షునిగా ప్రమాణం చేయనున్నారు. ఏ అధ్యక్షుడినీ శిక్షకు అతీతుడిగా ప్రకటించే అవకాశం లేకుండా రాజ్యాంగాన్ని సవరించాలని బైడెన్ పిలుపునిచ్చారు.