ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు … బైడెన్ కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హమాస్ మిలిటెంట్ గ్రూప్ అల్‌ఖైదా మాదిరిగానే కన్పిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు. హమాస్ దాడిలో 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 27 మంది అమెరికన్లు ఉన్నారు. వీళ్లు చాలా దుర్మార్గులు. అల్‌ఖైదా ముష్కరుల్లాగే ప్రవర్తిస్తున్నారు. నేను ముందు నుంచీ చెబుతున్నట్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు. హమాస్ దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది అని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు.






