మామ ఓటమి ఒప్పుకో..నచ్చజెప్పిన అల్లుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గట్టి పోటీ ఇచ్చి ఓడామని, ఓటమిని ఇకనైనా అంగీకరించాలని మామయ్య డొనాల్డ్ ట్రంప్ వద్దకు అల్లుడు జేర్డ్ కుష్నేర్ దౌత్యానికి వెళ్లారు. బైడెన్‌తో ఓటమిని తాను అంగీకరించడం లేదని, కోర్టులతోనే తేల్చుకుంటానని్ట ట్రంప్ చెప్పుతూ వస్తున్నారు. దీనితో తలెత్తుతున్న పరిణామాలు చక్కదిద్దేందుకు ట్రంప్ వద్దకు అల్లుడు వెళ్లారని, నచ్చచెప్పేందుకు యత్నించారని సీఎన్ఎన్ మీడియా తెలిపింది. ఎన్నికలతో ఎంతో కష్టపడ్డామని, పోటీ తీవ్రస్థాయిలో సాగిందని, గెలుపోటములు సహజమని, గౌరవంగా ఓడినట్లు ప్రకటన వెలువరించడం మంచిదని మామయ్యకు అల్లుడు సర్దిచెప్పేందుకు నానా పాట్లు పడ్డారని వెల్లడించారు. రేస్ ముగిసిందని, విజేత ఎవరో తేలాల్సి ఉంటుంది కదా అని కూడా చెప్పారు. అయితే అల్లుడి మాటలకు ట్రంప్ ఏ విధంగా స్పందించారనేది సృష్టం కాలేదు.






