కమలా హ్యారిస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా
అమెరికా కొత్త ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయురాలు సబ్రీనా సింగ్ నియమితులైనట్టు అధికార ప్రకటన విడుదలైంది. బైడెన్, హ్యారిస్ ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారిస్ ప్రెస్ సెక్రటరీగా సబ్రీనా సేవలందించారు. ఈమెతో పాటు వైట్‌హౌస్‌లో పనిచేసే పలువురు సభ్యుల నియామకాలను ప్రకటించారు. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ప్రతిభావంతులు అమెరికా ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణలో తమకు అండగా నిలబడి మరింత దృఢంగా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తారని కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్ వ్యాఖ్యానించారు.






