వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీగా సబ్రినా సింగ్
మరో ఇండో అమెరికన్‌కు వైట్‌హౌస్‌లో పదవి వరించింది. డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీగా సబ్రినా సింగ్‌ను జో బైడెన్ నియమించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన కమలా హారీస్‌కు ప్రెస్ సెక్రెటరీగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ వైట్‌హౌస్ సిబ్బందిలో అదనపు సభ్యులను ప్రకటించారు. ఇంతుక ముందు సబ్రినా మైక్ బ్లూంబర్గ్ అధ్యక్ష ప్రచార సీనియర్ ప్రతినిధిగా, కోరీ బుకర్ అధ్యక్ష ప్రచారానికి నేషనల్ ప్రెస్ సెక్రెటరీగా పని చేసింది. ఆమె గతంలో డెమొక్రాటిక్ నేషనల్ కమిటీకి డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్, అమెరికన్ బ్రిడ్జ్ ట్రంప్ వార్ రూమ్ ప్రతినిధి, హిల్లరీ క్లింటన్ 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రాంతీయ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆమె ఎస్కేడీకే నికర్ బాకర్ కన్సల్టింగ్ సంస్థ, రిపబ్లిక్ జాన్ షాకోవ్స్కీకి కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, వివిధ డెమొక్రాటిక్ కమిటీల్లోనూ పని చేశారు.






