Biden : నేను ట్రంప్ ను ఓడించేవాడిని : బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump ) ను ఓడిరచేవాడినని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) అన్నారు. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా? ఆ చర్య ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడానికి సహాయపడిరదని అనుకుంటున్నారా? అని ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. తాను అలా అనుకోవడం లేదన్నారు. తాను ఎన్నికల బరిలో ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓడిరచేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. కమలా హారిస్ (Kamala Harris) ఎన్నికల్లో ట్రంప్ ఓడిరచగలదని తాను భావించానని అందువల్లే ఆమెకు మద్దతిచ్చానని అన్నారు. అందుకు అనుగుణంగానే కమల తీవ్ర కృషి చేసిందని అన్నారు. ట్రంప్‌ను ఆమె ఓడిరచగలదని ఇప్పటికే తాను నమ్ముతున్నానని బైడెన్ అన్నారు. డెమోక్రటిక్ పార్టీ (Democratic Party)లో ఐక్యత కోసమే తాను పోటీ నుంచి వైదొలిగానని బైడెన్ పేర్కొన్నారు.