అమెరికా అన్నివిధాల అర్హుడైన ఉపాధ్యక్షుడు : కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన కమలా హారిస్ ప్రచారం ముమ్మరం చేశారు. పెన్సిల్వేనియాలో భారీ ప్రచార సభలో మాట్లాడారు. తన ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్‌ను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును వివరించారు. ఆయన కేవలం గవర్నర్ మాత్రమే కాదు, అంతకుమించి ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పారు. అమెరికా ప్రగతి కోసం, ప్రజల సౌభాగ్యం కోసం తాము కలిసి పని చేయబోతున్నామని వెల్లడిరచారు. అమెరికా అన్నివిధాల అర్హుడైన ఉపాధ్యక్షుడు టిమ్ వాల్జ్ అని ప్రశంసించారు.






