H1b VISA :హెచ్-1బీ వీసాలపై రచ్చ!
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ముంచుకొస్తున్న వేళ హెచ్-1బీ (H-1b VISA ) వీసాలపై చర్చ తీవ్రరూపం దాల్చింది. ఈ వ్యవహారం డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలో అంతర్గతంగా మంటలు రేపుతోంది. వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని భావించే అమెరికా సంస్థలు ఈ వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి. ఇందుకోసం ప్రతి ఏడాది 85 వేల హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఈ వీసా ద్వారా లబ్ధి పొందినవారిలో భారతీయులే(Indians) అధికంగా ఉన్నారు. వీసాల అంశంపై డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఇటీవల స్పందించారు. తాను ఎల్లప్పుడూ హెచ్-1బీ వీసాలకు అనుకూలమేనని తెలిపారు. అమెరికాలో అత్యంత సమర్థులైన వ్యక్తులు ఉండాలని నేను ఎల్లప్పుడూ భావిస్తారు. మనకు సమర్థులు అవసరం. మన దేశంలోకి తెలివైన వ్యక్తులు చాలామంది రావాలి. మునుపెన్నడూ లేని స్థాయిలో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి అని కొత్త సంవత్సరం వేడుకల్లో ఆయన మీడియాతో అన్నారు. ఆయన సన్నిహితులైన ఎలాన్ మస్క్(Elon Musk), వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) సైతం ఈ వీసాలకు మద్దతు ప్రకటించారు. అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి ఈ వీసాలు తప్పనిసరి అన్నారు.






