H1B Visa : హెచ్ 1బీ ఆటోరెన్యువల్ రద్దు!

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి మరో చేదు వార్త. ఇప్పటికే వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ (Trump) మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. గత బైడెన్ (Biden) ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్ వీసాలు హెచ్-1బీ, ఎల్-1 (L-1 Visa)ఆటో రెన్యువల్‌ను రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కారు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వర్క్ వీసా (Work Visas )లు ఆటోమేటిక్‌గా 180 రోజుల నుంచి 540 రోజులకు రెన్యువల్ అయ్యేలా తీసుకొచ్చిన నిర్ణయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీకి ప్రతిబంధకంగా మారుతుందని ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది.