డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్ తీవ్ర ఆరోపణలు
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్ ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ సందర్భంలో ట్రంప్ తనను అసభ్యకరంగా తాకినట్లు వెల్లడించారు. వారి మధ్య పరిచయం గురించి ఆమె తెలిపారు. స్టాసీ విలియమ్స్ అమెరికా మాజీ మోడల్. 1992లో ట్రంప్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిరది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ తో డేటింగ్లో ఉన్న ఆమెను ఓ పార్టీలో ట్రంప్‌కు పరిచయం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఓ రోజు జెఫ్రీ నన్ను, న్యూయార్క్‌లోని ట్రంప్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. నన్ను చూసి జెఫ్రీ, ట్రంప్ నవ్వుకున్నారు. అప్పుడే ట్రంప్ నన్ను తన వైపునకు లాక్కొని ఎంతో అసభ్యంగా తాకారు అని కమలా హారిస్ ప్రచార బృందానికి ఈ విషయాన్ని ఆమె ఫోన్ ద్వారా తెలియజేసింది. జెఫ్రీ, ట్రంప్ మంచి స్నేహితులని, వారిద్దరూ ఎంతో సమయం గడిపేవారని స్టాసీ విలియమ్స్ తెలిపారు. అతడు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఆమె ఈ విషయాలను హారిస్ బృందానికి తెలియజేస్తే, వారు మీడియాకు తెలిపారు. దీనిపై ట్రంప్ ప్రచారబృందం స్పందిస్తూ ఇదంతా కట్టుకథ అంటూ కొట్టిపారేసింది.






