డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ. 2020 అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో విచారణ నుంచి ఆయనకు మినహాయింపు లేదని ఫెడరల్ అపీల్స్ ప్యానల్ స్పష్టం చేసింది. అప్పట్లో దేశాధ్యక్షున్ని గనుక ఇలాంటి విచారణల నుంచి తనకు మినహాయింపు ఉందన్న ట్రంప్ వాదనలను న్యాయమూర్తులు తిరస్కరించడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. ఇక దీనిపై సుప్రీంకోర్టే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వచ్చే నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే దాకా ఈ అంశం సుప్రీం దాకా వెళ్లకుండా చూసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో నెగ్గి మళ్లీ అధ్యక్షుడైతే తన ప్రత్యేకాధికారాలను ఉపయోగించి ఈ కేసులను కొట్టేయడమో, స్వీయ క్షమాభిక్ష ప్రసాదించుకోవడమే చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






