Elon Musk :మస్క్ గుప్పిట యూఎస్ వేతనాల రహస్యం

అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏఫీషియన్నీ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk) నిర్వహిస్తున్నారు. తాజాగా యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ డోజ్ (Scott Besant Doge )కు అమెరికా ఫెడరల్ పేమెంట్ సిస్టమ్ యాక్సెస్ ఇచ్చినట్లు తెలిసింది. దీని ద్వారా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం, ఇతర సంస్థలకు నిధులు కేటాయించడం మొదలైన విషయాలను డోజ్ పరిశీలించి అధ్యక్షుడకి సలహాలు, సూచనలు ఇస్తుంది. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూలమార్పులే లక్ష్యంగా పని చేస్తున్న మస్క్ బృందానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ (Treasury Department) ప్రభుత్వ నిధుల నుంచి ప్రతి సంవత్సరం 2 ట్రిలియన్‌ల కంటే ఎక్కువ చెల్లింపులను జరుపుతోంది. సామాజిక భద్రతా చెల్లింపులు, పన్ను వాపసులు, ప్రభుత్వ కాంట్రాక్టర్‌లకు వేతనాలు, గ్రాంట్లు పొందే కొన్ని మిలియన్ల వ్యక్తుల వ్యక్తిగత సమాచారం ఇందులో ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ పరిశీలించడానికి మాస్క్ నేతృత్వంలోని డోజ్‌కు అనుమతిస్తున్నట్లు యూఎస్ సెనేటర్ రాన్ వైడెన్ (Ron Wyden) ధ్రువీకరించారు.