Donald Trump :డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక (Donald Trump) నిర్ణయం తీసుకొన్నారు. దిగుమతి సుంకాలకు సంబంధించి ఆయా దేశాలపై వారితో సమానంగా టారిఫ్‌లు (Tariffs) విధించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు ఎంతమొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తున్నాయో, అంతే మొత్తంలో ఆయా దేశాల ఎగుమతుల (Exports)పై తాము దిగుమతి(Import) సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. భారత్ (India) పైనా దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి.