మరో ముగ్గురికి క్షమాభిక్ష పెట్టిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాపణల పర్వం కొనసాగుతున్నది. తాజాగా ఆయన మరో ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఆ జాబితాలో క్యాంపేన్ మేనేజర్ పౌల్ మానాఫోర్ట్, మాజీ సలహాదారుడు రోజర్ స్టోన్, అల్లుడు జేర్డ్ కుష్నర్ తండ్రి చార్లెస్ కుష్నర్ కూడా ఉన్నారు. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న కేసులో మానాఫోర్ట్ 2018లో దోషిగా తేల్చారు. ఉభయసభలకు అబద్దం చెప్పిన సంఘటనలో రోజర్ స్టోన్‌కు శిక్ష పడింది. అయితే స్టోన్‌కు కూడా ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ట్రంప్ తన చివరి రోజుల్లో క్షమాభిక్షలను ప్రసాదిస్తున్నారు. ఇప్పటి వరకు 29 మంది ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. దీంట్లో 26 మందికి పూర్తి స్థాయిలో క్షమాభిక్ష కల్పించారు. మరో ముగ్గరికి పాక్షిక విముక్తి కల్పించారు. అంటే ఆ ముగ్గురికీ జైలుశిక్షను తగ్గించనున్నారు.






