Guantanamo Bay :గ్వాంటనామో బేలో 30,000 మంది నిర్బంధానికి ఏర్పాట్లు

గ్వాంటనామో బేలో (Guantanamo Bay) 30,000 మంది నేరాభియోగాలున్న అక్రమ వలసదారుల (Illegal immigrants)ను నిర్బంధించేందుకు ఏర్పాట్లు చేసే ప్రెసిడెన్షియల్ మెమోరాండంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీని నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రక్షణ, హోంలాండ్ (Homeland)విభాగాలను ఆయన ఆదేశించారు. ఇప్పటిదాక గ్వాంటనామో బేను ఉగ్రవాదులను నిర్బంధించేందుకు వినియోగిస్తున్నారు. 30,000 మందిలో తీవ్ర నేరాభిగాలున్న నిందితులున్నారని, వారిని స్వదేశాలు నియంత్రిస్తాయన్న నమ్మకం తమకు లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.